japan: జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం
- హొక్కాయ్ డో దీవిలో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
జపాన్ ను ఈ ఉదయం శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. హొక్కాయ్ డో దీవిలో ఈ భూకంపం సంభవించింది. ప్రధాన నగరం సప్పోరోకు 68 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరో 125 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ఆచూకీ లభించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.