nikhil: చిరంజీవిగారిని చూసే హీరోని కావాలనుకున్నాను: హీరో నిఖిల్
- తెరపై ఒకసారి కనిపిస్తే చాలనుకున్నాను
- ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చాను
- ఎవరినీ చూసి అసూయపడలేదు
సాధారణంగా యువతరం కథానాయకులు ఇంటర్వ్యూస్ లో మాట్లాడేటప్పుడు, చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకునే తాము సినిమాల్లోకి వచ్చినట్టుగా చెబుతూ వుంటారు. అలాగే తాను కూడా చిరంజీవిగారి సినిమాలు చూశాకే హీరోను కావాలనుకున్నానని, తాజాగా 'ఇంటరాగేషన్'(టీవీ 9) కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నిఖిల్ చెప్పాడు.
"చిరంజీవిగారి 'గ్యాంగ్ లీడర్' సినిమా చూసినప్పుడే హీరోను కావాలని అనుకున్నాను. మనసులోని ఆ కోరిక నాతో పాటు పెరుగుతూ వచ్చింది. 'హ్యాపీడేస్' సినిమా సమయానికి ఒక్కసారి తెరపై కనిపించినా చాలు అని ఆశ పడ్డాను. ఆ తరువాత సోలో హీరోగా చేస్తే బాగుంటుందని అనుకున్నాను .. 'యువత' సినిమా చేశాను. 'స్వామిరారా' .. కార్తికేయ'లతో హిట్స్ కొడుతూ వచ్చాను. ఒక్కసారి తెరపై కనపడితే చాలనుకున్న వాణ్ణి, ఈ రోజున ఈ స్థాయికి వచ్చాను. ఈ ప్రయాణంలో నాతోటి వాళ్లను చూసి ఎప్పుడూ అసూయపడలేదు" అని చెప్పుకొచ్చాడు.