bjp: ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ పరిధులు దాటకుండా చూడాలని గవర్నర్ ను కోరాం: బీజేపీ నేత లక్ష్మణ్

  • గత అనుభవాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం
  • మాకున్న ఆందోళన, అనుమానాలను చెప్పాం  
  • గత ఎన్నికలలో అధికారులు టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరించారు

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన ఇష్టానుసారం ప్రవర్తించకుండా చూడాలని గవర్నర్ ని కోరామని టీ-బీజేపీ నేత లక్ష్మణ్ చెప్పారు. గవర్నర్ ని టీ-బీజేపీ నేతలు ఈరోజు సాయంత్రం కలిశారు. అనంతరం, మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన పరిధులు దాటకుండా చూడాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామని చెప్పారు.

తమకున్న ఆందోళన, అనుమానాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత అనుభవాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. గతంలో జరిగిన ‘గ్రేటర్’ ఎన్నికలలో అధికారులు టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరించారని ఆరోపించారు. కాగా, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, తెలంగాణలో పరిపాలన స్తంభించిందని, కేసీఆర్ అడుగులకు మడుగులొత్తుతూ అధికారులు పనిచేశారని, అసెంబ్లీ రద్దు అప్రజాస్వామికమని విమర్శించారు.

  • Loading...

More Telugu News