Jammu And Kashmir: పిండమార్పిడి సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం

  • జెర్సీ, సాహీవాల్‌ జాతికి చెందిన తొలి దూడ జననం
  • కేంద్ర పశుగణాభివృద్ధి, పరిశోధన సంస్థ ప్రతినిధుల వెల్లడి
  • జమ్ము రాష్ట్ర పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు

మేలుజాతి పశువుల కోసం జమ్ము రాష్ట్ర పశు సంవర్థక శాఖ చేపట్టిన పిండమార్పిడి పరిశోధన ప్రాజెక్టు విజయవంతమైందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సాహీవాల్‌ జాతికి చెందిన పిండాన్ని జెర్సీ ఆవు గర్భంలోకి ప్రవేశపెట్టగా అభివృద్ధి చెందిన తొలి దూడ శుక్రవారం జన్మించిందని ప్రకటించారు. సాహీవాల్‌ జాతికి చెందిన ఏడు రోజులు ఘనీభవించిన పిండాన్ని గత ఏడాది డిసెంబరు 4న జెర్సీ ఆవు గర్భంలోకి వైద్యులు ప్రవేశపెట్టారు. జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థతో కలిసి జమ్ము రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది.

  • Loading...

More Telugu News