jayalalitha: జయలలితకు భారతరత్న ఇవ్వాల్సిందే.. కేంద్రాన్ని కోరిన తమిళనాడు ప్రభుత్వం

  • కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
  • సెంట్రల్ రైల్వే పేరు మార్చాలని..
  • రాజీవ్ హంతకులను విడిచిపెట్టాలని ప్రతిపాదన
మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతరత్న ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ కేంద్రాన్ని కోరింది. అలాగే తమిళనాడు సెంట్రల్ రైల్వే స్టేషన్‌ పేరును ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వేగా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి  డి.జయకుమార్ తెలిపారు. అలాగే, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఏడుగురిని విడిచిపెట్టాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పిన జయకుమార్.. తమ ప్రతిపాదనలను వెంటనే గవర్నర్‌కు పంపినట్టు తెలిపారు.
jayalalitha
Tamilnadu
Bharat Ratna
AIADMK
Rajiv Gandhi
Edappadi K Palaniswami

More Telugu News