Petrol: పెట్రోలు ధరలను నిరసిస్తూ బంద్ చేస్తుంటే.. మరోపక్క నేడు కూడా ధరలను పెంచిన చమురు కంపెనీలు!
- లీటరు పెట్రోలుపై 23 పైసల ధర పెంపు
- డీజిల్ ధరను 22 పైసలు పెంచుతూ నిర్ణయం
- ముంబైలో రూ. 88.12కు పెట్రోలు ధర
ఆకాశానికి ఎగిసిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని దేశవ్యాప్తంగా నేడు భారత్ బంద్ జరుగుతున్న వేళ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తమ పనిని తాము కానిచ్చేశాయి. సోమవారం నాడు లీటరు పెట్రోలుపై 23 పైసలు, లీటరు డీజిల్ పై 22 పైసల మేరకు ధరను పెంచేశాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.80.73, రూ. 72.83కి పెరుగగా, ముంబైలో పెట్రోలు ధర రూ.88.12కు, డీజిల్ ధర రూ. 77.32కు చేరుకున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 21 విపక్ష పార్టీలు నేడు జరుగుతున్న బంద్ లో పాల్గొంటున్నాయి. బంద్ ప్రభావం కర్ణాటక, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం చూపుతోంది.