Gay S*x: గే సెక్స్ కేసుల్లో యూపీ టాప్.. తర్వాతి స్థానంలో కేరళ: ఎన్ఎస్ఆర్బీ
- గణాంకాలు విడుదల చేసిన ఎన్సీఆర్బీ
- గే సెక్స్ కేసుల్లో యూపీ తర్వాతి స్థానంలో కేరళ
- బాధితుల్లో ఎక్కుమంది చిన్నారులే
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఈ విషయంపై దేశవ్యాప్త చర్చ మొదలైంది. కాగా, గతంలో ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2014-2016 మధ్య మొత్తం 4,690 కేసులు నమోదయ్యాయి. 2016లో 2,195, 2015లో 1,347, 2014లో 1,148 కేసులు సెక్షన్ 377 కింద నమోదైనట్టు ఎన్సీఆర్బీ తన నివేదికలో పేర్కొంది.
2016లో ఉత్తరప్రదేశ్లో మొత్తం 999 కేసులు నమోదై జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 207 కేసులతో కేరళ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 183, మహారాష్ట్రలో 170 కేసులు నమోదయ్యాయి. 2015లో ఉత్తరప్రదేశ్లో 239 కేసులు నమోదు కాగా, కేరళ, మహారాష్ట్రలో 159 చొప్పున నమోదయ్యాయి. హరియాణాలో 111, పంజాబ్లో 81 కేసులు నమోదయ్యాయి. 2015లో దేశంలో నమోదైన మొత్తం 1,347 కేసుల్లో 814 కేసుల్లో బాధితులు చిన్నారులు కావడం గమనార్హం. వీటిలో 179 కేసులు ఉత్తరప్రదేశ్లో, 142 కేసులో కేరళలో, 116 కేసులు మహారాష్ట్రలో, 63 కేసులు హరియాణాలో నమోదయ్యాయి.