aadhar: పశువులకూ ఆధార్‌ లింక్‌ : సూరత్‌ నగర పాలక సంస్థ నిర్ణయం

  • వీధుల్లోకి విచ్చలవిడిగా వదిలేయకుండా కట్టడికి నిర్ణయం
  • గోమాత చెవులకు గుర్తింపు బిళ్ల
  • యజమాని యూనిక్‌ ఐడీతో అనుసంధానం

పశువులను వీధుల్లోకి విచ్చల విడిగా వదిలేస్తున్న పెంపకందార్లను కట్టడి చేసేందుకు గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ నగర పాలక సంస్థ వినూత్న ప్రయోగం చేసింది. గోమాతలనూ ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. పశువులకు గుర్తింపు సంఖ్య (క్యాటిల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌-సీఆర్‌ఎన్‌)ను కేటాయించి వాటి వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తోంది. అనంతరం ఆవుల చెవులకు గుర్తింపు బిళ్లను తగిలించి దాని యజమాని ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేస్తున్నారు.

ఇప్పటికే 25 వేల పశువులను గుర్తించి వాటి యజమానుల ఆధార్‌తో అనుసంధానించారు. రోడ్లపై పశువులను వదిలేస్తే ఒక్కోదానికి రోజుకి రూ.1800 జరిమానా విధిస్తున్నారు. పశువులు రోడ్లపై ఇష్టానుసారం తిరగడం వల్ల ఎదురవుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు ఈ నిర్ణయంతో చెక్‌ చెప్పవచ్చునని నగరపాలక సంస్థ అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News