junior ntr: ఎన్టీఆర్ ను చూస్తే.. మళ్లీ పాత ఎనర్జీని తెచ్చుకున్నట్టు అనిపించింది!: తమన్

  • 'అరవింద సమేత' షూటింగ్ లో బిజీ అయిన తారక్
  • నిన్న ఓ సాంగ్ చిత్రీకరణ
  • తారక్ మళ్లీ పాత ఎనర్జీని తెచ్చుకున్నాడన్న తమన్

తమ తండ్రి నందమూరి హరికృష్ణ హఠాన్మరణాన్ని దిగమింగుకుని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు షూటింగ్ ల బాట పట్టారు. మనసులో ఎంతో భాధ ఉన్నా... సినిమాల షూటింగ్ లకు అంతరాయం కలగకూడదనే భావనతో వారు పనిలో నిమగ్నమయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవిందసమేత' షూటింగ్ లో తారక్ బిజీ అయ్యాడు. నిన్న ఓ సాంగ్ ను చిత్రీకరించారు. దీనిపై సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశాడు.

'చాలా ఎమోషనల్ గా తారక్ అన్న ఓ సాంగ్ కోసం షూటింగ్ స్టార్ట్ చేశారు. తన డ్యాన్స్ తో మళ్లీ తన పాత ఎనర్జీని తెచ్చుకున్నట్టుగా అనిపించింది. తారక్ అన్నను మళ్లీ ఈ విధంగా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. 'అరవింద సమేత' టీమ్ తరపున తారక్ కు లాట్స్ ఆఫ్ లవ్. ఆడియో అప్ డేట్స్ కూడా ఈ వారంలో స్టార్ట్ అవుతాయి' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 

  • Loading...

More Telugu News