jaggareddy: జగ్గారెడ్డిపై కేసు ఏయే సెక్షన్ల కింద నమోదయిందంటే..!

  • ఇతరులను కుటుంబసభ్యులుగా పేర్కొని అమెరికాకు తీసుకెళ్లారంటూ కేసు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ఈరోజు జగ్గారెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు అక్రమంగా తీసుకెళ్లి, వారిని అక్కడే వదిలి వచ్చారనే ఆరోపణలతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి పటాన్ చెరులో ఓ కార్యక్రమంలో ఉండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఆయనను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరచనున్నారు.

గుజరాత్ కు చెందిన ముగ్గురిని తన కుటుంబసభ్యులుగా పేర్కొంటూ 2004లో వారిని అమెరికాకు తరలించారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ ముగ్గురి వద్ద నుంచి రూ. 15 లక్షలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్టు యాక్ట్ సెక్షన్ 12, ఇమిగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 24 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
jaggareddy
arrest
congress

More Telugu News