jaggareddy: చంచల్ గూడ జైలుకు జగ్గారెడ్డి తరలింపు!

  • మనుషుల అక్రమ రవాణా కేసు
  • ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు 
  • జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్
మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో జగ్గారెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. తన కుటుంబసభ్యుల పేర్లతో ముగ్గురిని అక్రమంగా అమెరికాకు తరలించిన కేసులో జగ్గారెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఉద్దేశపూర్వకంగా జగ్గారెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 
jaggareddy
remand
chanchalguda jail

More Telugu News