mithali raj: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్!
- అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించిన ఘనత
- మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో రికార్డు
- 118 వన్డేలకు నాయకత్వం వహించిన హైదరాబాదీ
హైదరాబాదీ అమ్మాయి, భారతీయ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో మిథాలీ ఈ మైలురాయిని అందుకున్నారు. ఇప్పటి వరకు 195 వన్డేలు ఆడిన మిథాలీ 118 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఘనత సాధించడం ద్వారా ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ చార్లెస్ ఎడ్వర్ట్ (117 వన్డేలు) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టారు.
ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రీడాకారిణి బెలిండా క్లార్క్ (101) మూడో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు వందకు పైగా వన్డేలకు నాయకత్వం వహించింది ఈ ముగ్గురే.