Andhra Pradesh: ఏపీ సిగలో మరో అంతర్జాతీయ కంపెనీ.. నేడు ‘హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్’ను ప్రారంభించనున్న మంత్రి లోకేశ్

  • గన్నవరంలోని మేధా టవర్స్‌లో కార్యాలయం
  • వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు
  • వచ్చే నెల 8న ఇక్కడే హెచ్‌సీఎల్ కూడా ప్రారంభం

ఆంధప్రదేశ్‌కు మరో అంతర్జాతీయ కంపెనీ తరలివచ్చింది. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పేరుగాంచిన హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌‌ నేడు ప్రారంభం కాబోతోంది. ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ నేడు కంపెనీని ప్రారంభించనున్నారు. గన్నవరం సమీపంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు కానున్న ఈ కంపెనీ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.  

అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్- హెచ్‌సీఎల్ కలిసి హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌‌గా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సంస్థ అమెరికా, కెనడా, యూరప్‌, మధ్యఆసియా‌, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన దేశంలో కోయంబత్తూరులో తొలి శాఖను ప్రారంభించారు. కాగా, అక్టోబరు 8న మేధా టవర్స్‌లోనే హెచ్‌సీఎల్ కంపెనీ కూడా ఏర్పాటు కాబోతుండడం గమనార్హం.

  • Loading...

More Telugu News