Kurnool District: కర్నూలులో భారీ ‘ఎకో ఫ్రెండ్లీ గణపయ్య’.. దర్శించుకునేందుకు పోటెత్తుతున్న భక్తులు!

  • పూర్తిగా మట్టితో తయారుచేసిన వైనం
  • రూ.15 లక్షలు వెచ్చించిన నిర్వాహకులు
  • స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయకుడి విగ్రహాలు వాడాలని చాలామంది పర్యావరణవేత్తలు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ బాటలోనే కర్నూలులో 51 అడుగుల భారీ మట్టి గణపయ్యను ప్రతిష్టించారు. లక్ష్మీనరసింహ స్వామి కమిటీ ఆధ్వర్యంలో 51 అడుగుల ఎత్తైన ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఏర్పాటుచేశారు. ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్లకు చెందిన పవిత్రమైన మట్టితో 3 నెలలు కష్టపడి ఈ మట్టి గణపయ్యను రూపొందించారు. ఇందుకోసం సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశారు.
 
కాగా ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఈ మట్టి గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు వినాయకుడిని దర్శించుకున్నారు. స్వామి వారికి 9 రోజులు పూజలు నిర్వహించిన తర్వాత నిమజ్జనం చేస్తారు. 

  • Loading...

More Telugu News