kcr: కేసీఆర్ సన్యాసం తీసుకుంటారు.. కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోతారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పరాభవం తప్పదు
- టీడీపీ, సీపీఐలతో పొత్తులపై చర్చలు జరిగాయి
- సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చించలేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘోర పరాభవం తప్పదని చెప్పారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ సన్యాసం తీసుకుంటారని... కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. తెలుగుదేశం, సీపీఐలతో పొత్తులపై చర్చలు జరిగాయని... అయితే, సీట్ల సర్దుబాటుపై మాత్రం చర్చలు జరపలేదని తెలిపారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు.
గత నాలుగేళ్లుగా ఉపాధ్యాయులను కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని, పీఆర్సీని అమలు చేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 20 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. 10 లక్షల మందికి నిరుద్యోగభృతిని ఇస్తామని తెలిపారు. కొండగట్టు బాధిత కుటుంబాలను పరామర్శించి, వారిని ఆదుకుంటామని చెప్పారు.