BJP: మళ్లీ అద్వానీకే ఎథిక్స్ కమిటీ చైర్మన్ పదవి!
- ఎంపిక చేసిన లోక్‌సభ స్పీకర్
- సభ్యుల అనైతిక ప్రవర్తనపై కమిటీ పరిశీలన
- మరికొన్ని కమిటీ చైర్మన్లు నియామకం
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ లోక్‌సభలో ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా తిరిగి నియమితులయ్యారు. లోక్‌సభ సభ్యుల అనైతిక ప్రవర్తన, వారిపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సుమోటాగా కొన్ని కేసులను స్వీకరిస్తుంది. అద్వానీని ఎంపిక చేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బులెటిన్ విడుదల చేశారు.
అలాగే, మరికొన్ని కమిటీలకు కూడా చైర్మన్ల నియామకాన్ని స్పీకర్ చేపట్టారు. సభ్యుల గైర్హాజరు కమిటీ చైర్మన్‌గా పి.కరుణాకరన్ (రెండోసారి), ప్రభుత్వ హామీ కమిటీ చైర్మన్‌గా రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, పేపర్స్ లేయడ్ ఆన్ టేబుల్ కమిటీ చైర్మన్‌గా చంద్రకాంత్ బి.ఖైరే, లెజిస్లేషన్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా దిలీప్‌కుమార్ మన్సుఖ్లాల్ గాంధీలను నియమించినట్లు లోక్‌సభ ఓ బులెటిన్‌లో వెల్లడించింది.