machili patnam: మచిలీపట్నంలో 25 అడుగుల మట్టి గణపతి!
- రాజుపేట లక్ష్మీగణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు
- నాలుగు ట్రాక్టర్ల మట్టి, ఊక వినియోగం
- పర్యావరణ పరిరక్షణ లక్ష్యం
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వినాయక ఉత్సవ కమిటీ పర్యావరణ హితాన్ని కోరుతూ 25 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. రాజుపేటలోని లక్ష్మీగణపతి ఆలయం నిత్య పూజా కమిటీ ఈ సాహసానికి పూనుకుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల విస్తృత ప్రచారం నేపథ్యంలో పది మందికీ తాము ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం నాలుగు ట్రాక్టర్ల మట్టి, ఊక వినియోగించినట్లు చెప్పారు. ఆకట్టుకునేలా రూపొందించిన ఈ విగ్రహాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈనెల 25న ఆలయ ప్రాంగణంలోనే నిమజ్జన కార్యక్రమం చేపడతామని కమిటీ తెలిపింది.