amrutha: ఎన్ని లక్షలైనా ఇస్తా.. నా కూతురుకి అబార్షన్ చేయండి: డాక్టర్ ను బెదిరించిన మారుతీరావు

  • పోలీసు విచారణలో వెలుగులోకి వస్తున్న దారుణాలు
  • కూతురు కడుపులోని బిడ్డను చంపేందుకు బేరసారాలు
  • అలాంటి పని చేయలేనని చెప్పిన డాక్టర్ జ్యోతి
మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు విచారణలో అమృత తండ్రి మారుతీరావు తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. మరోవైపు, తన కూతురుకు అబార్షన్ చేయాలంటూ డాక్టర్ జ్యోతిని మారుతీరావు బెదిరించినట్టు విచారణలో తేలింది. కుదరని పక్షంలో తన కూతురుకు పుట్టబోయే బిడ్డను గర్భంలోనే చనిపోయేలా చేయాలని ఆయన ఒత్తిడి తీసుకొచ్చాడు. దీని కోసం ఎన్ని లక్షలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని చెప్పాడు. కానీ, బిడ్డను చంపేందుకు డాక్టర్ జ్యోతి నిరాకరించారు. మరోవైపు, ప్రణయ్ హత్య నేపథ్యంలో, మిర్యాలగూడలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
amrutha
pranay
maruthi rao
miryalaguda
murder

More Telugu News