Nannapaneni: నన్నపనేనికి 'డిప్లోపియా'... పేపర్, టీవీ చూడాలన్నా ఇబ్బందే!
- అనారోగ్యం బారినపడ్డ నన్నపనేని
- నియంత్రణలో లేని రక్తపోటు
- బలహీనమైన కంటి నరాలు
- గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అనారోగ్యం బారిన పడ్డారు. గత పదిరోజులుగా ఆమె డిప్లోపియా (ప్రతి వస్తువు రెండుగా కనిపించడం) సమస్యతో బాధపడుతూ, గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తపోటు నియంత్రణలో లేని వారికి ఈ సమస్య తలెత్తుతుంది. కంటి నరాలు బలహీనపడతాయి. ప్రస్తుతం నన్నపనేని ఇదే సమస్యతో బాధపడుతున్నారని, ఆమెకు అధిక రక్తపోటు ఉందని, ప్రతి వస్తువూ రెండుగా కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. ఆమె కాసేపు కూడా టీవీ చూడలేకపోతున్నారు, దినపత్రికలు చదవలేకపోతున్నారు. వీటికితోడు విపరీతమైన తలనొప్పితో చూపు మసకబారింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.