Cricket: ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసిన తమీమ్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

  • శ్రీలంకతో మ్యాచ్ లో గాయపడ్డ తమీమ్
  • వికెట్లన్నీ పడిపోవడంతో క్రీజులోకి
  • గ్రేమ్ స్మిత్ తో పోలుస్తున్న నెటిజన్లు

యూఏఈలో శనివారం ప్రారంభమైన ఆసియా కప్ లో బంగ్లాదేశ్ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ముష్ఫికర్ రహీమ్ (144: 150 బంతుల్లో 11×4, 4×6) బంగ్లాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో రహీమ్ తో పాటు బంగ్లా ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ మ్యాచ్ లో భాగంగా పేస్ బౌలర్ లక్మల్ బౌలింగ్ లో తమీమ్ గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. చివరికి 9 వికెట్లు పడిపోవడంతో గాయంతో బాధపడుతున్న తమీమ్ బ్యాటింగ్ కు వచ్చాడు. గాయంతో బాధపడుతూనే ముష్ఫికర్ తో కలసి బంగ్లాదేశ్ స్కోరును 261 పరుగులకు చేర్చాడు. ఎడమ చేతికి గాయమైనప్పటికీ కేవలం కుడిచేతితో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. దీంతో తమీమ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కొందరు నెటిజన్లు తమీమ్ ను సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తో పోలుస్తున్నారు. 2009లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ లో చేయి విరిగినా స్మిత్ జట్టు కోసం 8.2 ఓవర్ల పాటు మైదానంలో ఒంటి చేత్తో పోరాడాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 261 పరుగులు చేయగా, బంగ్లా బౌలర్ల ధాటికి శ్రీలంక 124 రన్స్ కే ఆలౌట్ అయింది.

  • Loading...

More Telugu News