Timemagzine: అమెరికాకు చెందిన 'టైమ్‌' మ్యాగజైన్‌ అమ్మకం: రూ.1378.92 కోట్లకు డీల్‌

  • వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం
  • స్వాధీనం చేసుకున్న సేల్స్‌ఫోర్స్‌ సహ వ్యవస్థాపకుడు
  • 1923లో పత్రిక ప్రారంభం

అమెరికాలోని ప్రముఖ వార్తాపత్రిక ‘టైమ్‌ మ్యాగజైన్‌’ చేతులు మారుతోంది. మెరిడెత్‌ కార్పొరేషన్‌ ఈ పత్రికను రూ.1378.92 కోట్ల (190 మిలియన్‌ డాలర్లు)కు విక్రయించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రచురించింది. ప్రముఖ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ సహవ్యవస్థాపకుడు మార్క్‌బెనియాఫ్‌ దంపతులు దీన్ని కంపెనీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కొనుగోలు చేసినట్టు పేర్కొంది. టైమ్‌ మ్యాగజైన్‌తో పాటు ఫార్చ్యూన్, మనీ, స్పోర్ట్స్‌ ఇల్లస్ట్రేటెడ్‌ పబ్లికేషన్‌లను మెరిడెత్‌ ఈ ఏడాది మార్చిలో అమ్మకానికి ఉంచింది.

టైమ్‌ అమ్ముడుపోగా మిగిలినవి కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో చాలా మ్యాగజైన్‌లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా సంస్థలు అమ్మకాల బాటపడుతున్నాయి. యాలే యూనివర్సిటీకి చెందిన హెన్నీ లూస్‌, బ్రటన్‌ హాడెన్‌లు 1923లో టైమ్‌ మ్యాగజైన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు.

  • Loading...

More Telugu News