sensex: మరో బ్లాక్ మండే... కుప్పకూలిన మార్కెట్లు!
- ప్రభావం చూపిన రూపాయి పతనం
- కేంద్రం వ్యాఖ్యలతో దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- 505 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈరోజు మరో బ్లాక్ మండేగా నిలిచింది. రూపాయి విలువ పతనమవుతుండటంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం మార్కెట్లపై పడింది. దీనికి తోడు రూపాయి విలువ పతనాన్ని నిలువరించడానికి అనవసరమైన దిగుమతులను నిషేధిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన కూడా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 505 పాయింట్లు పతనమై 37,585కు పడిపోయింది. నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 11,377కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్స్ (14.74%), అవంతి ఫీడ్స్ (13.14%), మోన్శాంటో ఇండియా (10.73%), వెంకీస్ ఇండియా (10.00%), సుజ్లాన్ ఎనర్జీ (9.00%).
టాప్ లూజర్స్:
అశోకా బిల్డ్ కాన్ (-6.08%), క్వాలిటీ (-4.88%), రెడింగ్టన్ ఇండియా (-4.34%), ఐసీఐసీఐ లొంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (-4.30%), బాటా ఇండియా (-4.25%).
ఈనాటి ట్రేడింగ్ లో మొత్తం 957 స్టాకులు నష్టాలను మూటకట్టుకోగా... 796 స్టాకులు లాభాలను చవిచూశాయి. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా తదితర పెద్ద సంస్థలు 2 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి.