amrutha: మా నాన్నను ఫాస్ట్ ట్రాక్ లో ఉరితీయాలని కోరుకుంటున్నా: అమృత

  • మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
  • మా నాన్న మానవత్వం లేని మనిషి
  • అలాంటి వారు మరెవరు ఉన్నా... వారంతా మారాలి
మిర్యాలగూడ సెంటర్లో తన భర్త ప్రణయ్ విగ్రహాన్ని నెలకొల్పాలని అమృత కోరింది. తన తండ్రితో పాటు తాను బయటకెళ్లినప్పుడు ప్రణయ్ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని తన తండ్రి మారుతీరావు చుట్టుపక్కల చూసేవారని... ఇప్పుడు మెయిన్ రోడ్డుపైన ప్రణయ్ విగ్రహం కనపడాలని, ప్రతి రోజు అందరికీ ప్రణయ్ కనపడాలని తెలిపింది. ప్రతి క్షణం ఎవరో ఒకరి మైండ్ లో ప్రణయ్ ఉండాలని చెప్పింది.

ఈ ఘటనకు సంబంధించి కొందరు నెగెటివ్ గా ట్రోల్ చేస్తున్నారని ప్రణయ్ ఫ్రెండ్స్ చెబుతున్నారని... నెగెటివ్ ట్రోల్ చేసేవారందరికీ తాను ఒకటే చెబుతున్నానని... ప్రణయ్ స్థానంలో మీరు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించాలని, లేకపోతే తన స్థానంలో మీ సిస్టర్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించింది. తన తండ్రికి మానవత్వం లేదని... అలాంటివారు మరెవరైనా ఉంటే వారు మారాలని కోరుకుంటున్నానని చెప్పింది. న్యాయం త్వరగా జరగాలని... ఫాస్ట్ ట్రాక్ లో వారిని ఉరితీయాలని విన్నవిస్తున్నానని తెలిపింది.
amrutha
pranay
miryalaguda
maruthi rao

More Telugu News