karthi chidambaram: అమెరికా వెళ్లడానికి కార్తీ చిదంబరంకు సుప్రీం అనుమతి!
- ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకూ విదేశాలకు వెళ్లొచ్చు
- కుమార్తెను కళాశాలలో చేర్పించేందుకు వెళుతున్న కార్తీ
- ధర్మాసనం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదంటూ షరతు
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి అమెరికాకు వెళ్లేందుకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ అక్రమ లావాదేవీల కేసులో ప్రస్తుతం కార్తీ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకూ అమెరికా వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.
తన కుమార్తెను కళాశాలలో చేర్పించేందుకు తాను అమెరికాకు వెళ్లాల్సి ఉందన్న కార్తీ అభ్యర్థనపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. విదేశీ పర్యటన విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సూచించింది. మరోవైపు కార్తీకి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీలోని పటియాలా హైకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది.