yes bank: సీఈవో పదవీకాలాన్ని పొడగించకపోవడంతో కుప్పకూలిన బ్యాంకు షేర్లు
- రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించాలని ఆగస్టులో నిర్ణయం
- పదవీకాలం పొడిగింపునకు ఆర్‌బీఐ నిరాకరణ
- వచ్చే ఏడాది జనవరికి రాణా కపూర్ పదవీకాలం కుదింపు
ప్రయివేటు రంగ యస్ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించకపోవడంతో శుక్రవారం ఆ బ్యాంకు షేర్లు కుప్పకూలాయి. రాణా కపూర్‌ను బ్యాంకు సీఈవోగా మరో మూడేళ్లపాటు కొనసాగించాలని ఆగస్టులో యస్ బ్యాంకు నిర్ణయించింది. ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అనుమతి కోరింది. అయితే, దీనికి ఆర్‌బీఐ నిరాకరించింది.
రాణా కపూర్ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది 31కి కుదించింది. ఆ తర్వాత కొత్త సీఈవోను నియమించాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం ఆరంభ ట్రేడింగ్ నుంచే భారీ నష్టాలతో బ్యాంకు షేర్ విలువ మొదలైంది. ఒకానొక దశలో 34 శాతం తగ్గి 52 వారాల కనిష్టానికి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతోంది. దీంతో తదుపరి కార్యాచరణ నిమిత్తం బ్యాంకు బోర్డు ఈ నెల 25న సమావేశం కానుంది.