Hyderabad: తెల్లారకుండానే కదిలిన ఖైరతాబాద్ గణనాధుడు!
- పది రోజుల పాటు పూజలందుకున్న గణనాధుడు
- ఈ సంవత్సరం సప్తముఖ కాళసర్ప మహాగణపతి అవతారం
- నేడు ఒంటిగంటలోపు నిమజ్జనం
పది రోజుల పాటు భక్తుల పూజలను అందుకున్న హైదరాబాద్, ఖైరతాబాద్ గణనాధుడు నిమజ్జనోత్సవానికి కదిలాడు. ఈ సంవత్సరం 57 అడుగుల ఎత్తులో పది రోజుల పాటు భక్తుల పూజలను అందుకున్న హైదరాబాద్, ఖైరతాబాద్ గణనాధుడు నిమజ్జనోత్సవానికి కదిలాడు. ఈ సంవత్సరం 57 అడుగుల ఎత్తులో సప్తముఖ కాళసర్ప మహాగణపతిగా కొలువుదీరి, లక్షలాది మందికి దర్శనమిచ్చిన విఘ్నేశ్వరుడిని, నేడు సాధ్యమైనంత ముందుగానే నిమజ్జనం చేయాలన్న సంకల్పంతో భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ, జీహెచ్ఎంసీ, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
నిన్న రాత్రి 11 గంటల సమయానికి ఈ భారీ విగ్రహం చుట్టూ ఉన్న అలంకరణలను తొలగించారు. ఆపై 12 గంటలకల్లా, వెల్డింగ్ పనులను ప్రారంభించారు. ఒంటిగంట నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. విజయవాడలోని ఓ ట్రాన్స్ పోర్టు కంపెనీ నుంచి తెచ్చిన భారీ వాహనంపై ప్రత్యేక క్రేన్ సాయంతో విగ్రహాన్ని ఎక్కించే పనులు ఉదయం 6 గంటలకల్లా పూర్తయింది.
ఖైరతాబాద్ గణనాయకుని శోభాయాత్ర, లక్డీకపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియేట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ లోకి ప్రవేశించనుండగా, ఈ మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరికాసేపట్లో నిమజ్జన యాత్ర ప్రారంభం కానుంది.