Tamil Nadu: ప్లాస్టిక్‌తో నిండిపోయిన ఎద్దు పొట్ట.. 38 కేజీల పాలిథిన్ కవర్లు వెలికితీత!
- తమిళనాడులోని మదురైలో ఘటన
- విలవిల్లాడిన మూగ జీవి
- మూడు గంటలపాటు ఆపరేషన్ చేసిన వైద్యులు
నగరాలు, పట్టణాల్లోని పశువులు తినడానికి గడ్డి కరువై ప్లాస్టిక్ సంచులను తింటూ కడుపు నింపుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. తమిళనాడులోని మదురై జిల్లాలో ఓ ఎద్దు కూడా ఇదే పనిచేసింది. యజమాని వేసే గడ్డితోపాటు ప్లాస్టిక్ కవర్లను కూడా తినేసింది. పొట్ట మొత్తం ప్లాస్టిక్‌తో నిండిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. తమిళనాడులోని మదురై జిల్లాలో జరిగిందీ ఘటన.
ఎద్దు విలవిల్లాడిపోతుండడంతో గమనించిన దాని యజమాని అళగుమణి వెంటనే పశువుల ఆసుపత్రికి తరలించాడు. ఎద్దు కడుపులో ప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు శనివారం మూడు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి ఏకంగా 38 కిలోల పాలిథిన్ కవర్లు, వ్యర్థాలను తొలగించారు.