Rafel: రిలయన్స్‌తో కలిసి పనిచేయాలని డసాల్ట్‌పై భారత్ ప్రభుత్వమే ఒత్తిడి చేసి ఉండొచ్చు : హాలాండే
- రిలయన్స్‌ను ఆప్సెట్ భాగస్వామిగా ఫ్రాన్స్ మాత్రం ఎంపిక చేయలేదు
- రాఫెల్ వ్యవహారంపై సంచలనానికి కారణమైన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే
- ఇవి దిద్దుబాటు చర్యలేమోనన్న అభిప్రాయం
‘రిలయన్స్‌ను ఆప్సెట్ భాగస్వామిగా ఫ్రాన్స్ మాత్రం ఎంపిక చేయలేదు. వారితో కలిసి పనిచేయాలని డసాల్ట్‌పై భారత ప్రభుత్వమే ఒత్తిడి చేసి ఉండవచ్చు` అంటూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే శనివారం మరో వ్యాఖ్య చేశారు. రాఫెల్ డీల్ విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వానికి రెండో అవకాశం ఇవ్వకుండా మోదీ ప్రభుత్వమే ఒత్తిడి చేసిందని ప్రకటించి భారత్‌లో రాజకీయ దుమారానికి హోలాండే కారణమైన విషయం తెలిసిందే.
దీంతో స్వదేశీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు దిద్దుబాటు చర్యలకు దిగినట్టున్నారు. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ ప్రకటన చేయాల్సి రావడంతో అటు నుంచి వచ్చిన సూచనల మేరకు ఆ దేశాన్ని ఒడ్డున పడేసేందుకు హోలాండే తాజా వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే హోలాండే గతంలో తాను మీడియా పార్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ విషయాలుగాని, మీడియాలో వస్తున్న కథనాలను గాని ఖండించక పోవడం గమనార్హం.