Ravi Crane: మారిన బడా గణేష్ క్రేన్... తొలిసారిగా వచ్చిన టడానో క్రేన్!

  • గత సంవత్సరం వరకూ రవి క్రేన్ సేవలు
  • ఈ సంవత్సరం మారిన క్రేన్
  • 400 టన్నుల బరువును పైకి లేపే క్రేన్

ఖైరతాబాద్ లో కొలువుదీరిన భారీ గణేశుడిని నిమజ్జనం చేసేందుకు వినియోగించే క్రేన్‌ ఈ సంవత్సరం మారింది. గత సంవత్సరం వరకూ రవి క్రేన్స్ కంపెనీ, 50 టన్నుల బరువును మోసే క్రేన్ తో గణేశుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం రవి క్రేన్ స్థానంలో జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన టడానో క్రేన్ ను ఉపయోగిస్తున్నారు.

అనేక విశిష్ఠతలున్న ఈ క్రేన్ దాదాపు 400 టన్నుల బరువును చాలా సులువుగా పైకి ఎత్తగలుగుతుందట. 12 టైర్లతో నడిచే ఈ క్రేన్ గంటకు 85 కి.మీ. వేగంతోనూ ప్రయాణిస్తుందట. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పుతో ఉండే క్రేన్ బూమ్ పొడవు 60 మీటర్ల వరకు సాగుతుందని అధికారులు తెలిపారు. దీన్ని మ్యానువల్‌ గా, రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌ సాయంతో నడిపించవచ్చని, నిమజ్జనానికి ఈ క్రేన్ ను వాడటం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News