BJP: రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణల ‘చీఫ్‌’ : బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా

  • రాహుల్‌ ఏమంటే దాన్ని పాకిస్థాన్‌ తందానతాన అంటోంది
  • ఆయనేమైనా అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేస్తున్నారా అని ఎద్దేవా
  • కాంగ్రెస్‌ అధినాయకుడిపై ఆగ్రహం

‘కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఏమంటే దాన్ని మన శత్రుదేశం పాకిస్థాన్‌ అందిపుచ్చుకుని తందానతాన అంటోంది. ఒకవేళ రాహుల్‌గాంధీ ఏమైనా అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారా?’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

‘మోదీ, అనిల్‌ అంబానీ చేతులు కలిపి రూ.1.3 లక్షల కోట్ల మేరకు సర్జికల్‌ దాడులకు పాల్పడి అమరవీరులను అగౌరవపరిచారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌ అదే పంథాలో మాట్లాడింది. మోదీ హఠావో (సాగనంపండి) అని రాహుల్‌ అనగానే పాకిస్థాన్‌ కూడా అదే మాటను అందిపుచ్చుకుంది. ప్రధానిపై రాహుల్‌ చేసే నిరాధార ఆరోపణలన్నింటినీ పాకిస్థాన్‌ సమర్థిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తే కూటమిలా అనిపిస్తున్నాయి’ అని షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణల ‘చీఫ్‌’ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News