kavitha: చిన్న మాట వ్యతిరేకంగా వచ్చినా నన్ను, అన్న కేటీఆర్ ను నాన్న నిలదీస్తారు: కవిత
- నాన్న వ్యక్తిత్వానికి సీఎం పదవి చాలా చిన్నది
- భవిష్యత్తు తరాల కోసం ఆయన తపిస్తుంటారు
- తాము ఎప్పుడు కలసినా ప్రజా సమస్యలపైనే చర్చిస్తుంటాం
తన తండ్రి కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఆయన మంచితనానికి, రాజనీతజ్ఞతకు, వ్యక్తిత్వానికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని ఆమె తెలిపారు. రాజకీయాల గురించి కాకుండా, భవిష్యత్తు తరాల కోసం ఆయన తపిస్తుంటారని తెలిపారు. వందేళ్ల తర్వాత కూడా ప్రజలు తనను గుర్తు పెట్టుకోవాలనే తపనతో ఆయన పని చేస్తుంటారని కితాబిచ్చారు.
తమ కుటుంబమంతా రాజకీయాల్లో ఉండటం వల్ల... తామంతా ఎప్పుడు కలిసినా ప్రజల సమస్యలపైనే చర్చిస్తుంటామని కవిత చెప్పారు. ఎప్పుడో ఒకసారి పిల్లల అంశం చర్చకు వస్తుందని తెలిపారు. అన్నయ్య కేటీఆర్ తో ఎక్కువగా రోజువారీ చర్చలు ఉంటాయని... నాన్న రెగ్యులర్ గా సూచనలు ఇస్తుంటారని చెప్పారు. ప్రతి రోజు న్యూస్ పేపర్లను పైనుంచి కింద వరకు చదవడం నాన్నకు అలవాటని తెలిపారు. ఎక్కడైనా ఓ చిన్నమాట తమకు వ్యతిరేకంగా వచ్చినా తనను, అన్నను ఇదేంటని నాన్న నిలదీస్తారని చెప్పారు.