nagarjuna: మనసు పడిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేకపోయిన 'దేవదాస్' డాన్!
- నా హీరోయిన్ న్యూస్ రీడర్
- ఆమె కనిపించిందంటే కంగారే
- మల్టీ స్టారర్ లోను రిస్క్ ఎక్కువే
నాగార్జున .. నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన 'దేవదాస్' ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి నాగార్జున మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను 'దేవ్' అనే పాత్రలో కనిపిస్తాను. కాలేజ్ రోజుల్లోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాను. ఆమె న్యూస్ రీడర్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆమెను ఆరాధిస్తూ వున్నా ఎప్పుడూ కలుసుకుని ఆ విషయాన్ని మాత్రం చెప్పలేకపోతాను. అందుకు కారణం ఆమె కనిపిస్తే కంగారు పుట్టడమే. ఎంతటి వారికైనా భయపడని నేను .. ఆమెను కలుసుకోవడానికి మాత్రం ఇబ్బంది పడిపోతుంటాను. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దాస్ .. మమ్మల్ని కలుపుతాడు. ఇలా చాలా వినోదభరితంగా ఈ సినిమా రూపొందింది. నానితో కలిసి మల్టీ స్టారర్ చేయడం ఆనందంగా వుంది. మల్టీ స్టారర్ లో రిస్క్ తక్కువ అంటే నేను ఒప్పుకోను .. ఇద్దరు హీరోలు కలిసి కూడా హిట్ కొట్టలేకపోయారు అనే మాట రాకుండా చూసుకోవాలి" అని చెప్పుకొచ్చారు.