Amaravathi: ‘షీర్‌వాల్‌’ సాంకేతిక పరిజ్ఞానంతో 12 అంతస్తుల భవనం పూర్తి

  • 85 రోజుల్లోనే పూర్తి చేసుకున్న భవనం
  • అఖిల భారత సర్వీసు అధికారుల కోసం భవనాలు
  • 12 అంతస్తుల్లో 24 ప్లాట్లు

రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో 12 అంతస్తుల భవనం 85 రోజుల్లోనే పూర్తయింది. మలేసియాలో ప్రాచుర్యం పొందిన ‘షీర్‌వాల్‌’ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవన నిర్మాణం జరిగింది. అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఈ భవనాలను నిర్మిస్తున్నారు. సిమెంటు, కంకర మిశ్రమంతో.. శ్లాబుతోపాటు సంబంధిత గోడలను కూడా పూర్తి చేయడమే ‘షీర్‌వాల్’ ప్రత్యేకత. 12 అంతస్తుల్లో కలిపి మొత్తం 24 ప్లాట్లు నిర్మించారు. సాధ్యమైనంత త్వరగా అలంకరణ పనులు కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేసే పనిలో గుత్తేదారు సంస్థ నిమగ్నమైంది. 

  • Loading...

More Telugu News