Rfel deal: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు మాట మార్చలేదట!
- పార్టనర్ ఎంపిక ఒత్తిడి భారత్‌దే అన్న హోలెండే
- తన మాటలను పునరుద్ఘాటించిన ఫ్రెంచి మాజీ ప్రధాని
- బయటపెట్టిన ఫ్రెంచిపత్రిక లా మాండే
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో డసాల్ట్‌తో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోమని చెప్పింది భారత ప్రభుత్వమేనని ప్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలేండే పునరుద్ఘాటించారు. ‘భారత్ ప్రధాని మోదీ కొత్తఫార్ములా ప్రకారమే రిలయన్స్ డిఫెన్స్ ఎంపిక జరిగింది’ అంటూ హోలేండే ఫ్రెంచి పత్రిక లా మాండేతో ప్రస్తావించారు.
రాఫెల్ ఒప్పందంపై హోలేండే చేసిన వ్యాఖ్యలతో భారత్‌లో దుమారం రేగిన విషయం తెలిసింది. మరునాడే రిలయన్స్ డిఫెన్స్ ఎంపికలో భారత్ పాత్ర ఏమీ లేదు అని హోలేండే మాటమార్చినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఆయన నిరాధార ఆరోపణలు చేసి, తర్వాత యూటర్న్ తీసుకున్నారంటూ బీజేపీ తన వాదనను సమర్థించుకుంటూ వచ్చింది.
వాస్తవానికి తాను ఆరోపించిన మరునాడే హోలేండే తన మాటలను పునరుద్ఘాటించారు. మాంట్రియల్లో జరిగిన ఓ సదస్సుకు హాజరైన సందర్భంగా ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెంట్ రాఫెల్ అంశాన్ని ప్రస్తావించగా కొత్తఫార్ములా గురించి చెప్పారు. అయితే ఫ్రెంచిలో మాట్లాడిన ఆయన మాటలు ఇంగ్లీష్ తర్జుమా సందర్భంగా ఎడిట్ అయ్యాయని తాజాగా వెలుగుచూసింది.