student: బాబోయ్ ఈ చదువు నావల్ల కాదు.. కృష్ణా జిల్లాలో ఇంటి నుంచి పారిపోయిన విద్యార్థి!

  • చదువు ఒత్తిడి భరించలేక విద్యార్థి జంప్
  • ఎంత చదవినా ఎక్కడం లేదని ఆవేదన
  • కన్నీరుమున్నీరు అవుతున్న తల్లిదండ్రులు

చదువుకోవాలనీ, అందరి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఓవైపు తల్లిదండ్రుల ఒత్తిడి, మరోవైపు వారి అంచనాలు అందుకోలేకపోతున్నామన్న బాధతో చాలామంది పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా చదువు ఒత్తిడి భరించలేని ఓ పిల్లాడు ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కంచికచర్లలో ఉంటున్న మునిస్వామి నాగరాజు అనే అబ్బాయి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిప్లోమా రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎంత చదివినా గుర్తుండకపోవడం, తల్లిదండ్రులు మంచి మార్కులు తెచ్చుకోవాలని మాటిమాటికీ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. తాను ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదనీ, తనను క్షమించాలని కోరుతూ లేఖ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మునిస్వామి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇకపై ఎన్నడూ చదువుకోవాలని ఒత్తిడి చేయమనీ, వెంటనే ఇంటికి వచ్చేయాలని అతని తల్లి ఈశ్వరి కోరుతోంది.

  • Loading...

More Telugu News