K Kavitha: ఇంటింటికీ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలి: ఎంపీ కవిత

  • అభివృద్ధి కార్యక్రమాలను వివరించుకుంటే పార్టీకి నష్టం
  • ప్రతి బూత్ కమిటీలో మహిళలకు ప్రత్యేక స్థానం
  • వెయ్యి కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం

ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన 570 కార్యక్రమాలను వివరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరించకుంటే పార్టీకి నష్టం చేసినవాళ్లమవుతామన్నారు. ఇవాళ బాల్కొండ నియోజక వర్గం లక్కోరలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.

గత ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డిని 38 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని.. ఈ ఏడాది 50వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు. పార్టీలో కొత్తగా చేరిన కార్యకర్తలు పాతవారిని కలుపుకుంటూ విజయం కోసం కృషి చేయాలని కవిత సూచించారు. ప్రతి బూత్ కమిటీలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఆమె అన్నారు.

వెయ్యి కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని చేపట్టామని కవిత వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 2 వేల కోట్లతో... 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును తయారు చేసుకుంటున్నామన్నారు.

  • Loading...

More Telugu News