SANITATION: పారిశుద్ధ్యం పేరుతో తిక్క నిర్ణయం.. టాయిలెట్స్ ను మూసేస్తున్న రైల్వే అధికారులు!
- దేశరాజధానిలో ఘటన
- తీవ్ర ఇక్కట్లు పడుతున్న ప్రయాణికులు
- పరిశుభ్రత పేరిట అధికారుల విచిత్ర నిర్ణయం
సాధారణంగా రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం మరింత మంది ఉద్యోగులను నియమించుకుంటారు. కానీ పాత ఢిల్లీ రైల్వే అధికారులు మాత్రం డిఫరెంట్. రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం దిగజారకుండా ఉండేందుకు అధికారులు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ పరిశుభ్రత కేటగిరిలో మంచి ర్యాంకు పొందిన ఈ స్టేషన్ అధికారులు దాన్ని నిలబెట్టుకునేందుకు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. పరిశుభ్రతను కాపాడేందుకు రాత్రిపూట టాయిలెట్లను మూసేయాలని నిర్ణయించారు. నిత్యం ప్రయాణికులు వెళుతూ ఉండే ఈ స్టేషన్ లో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ స్టేషన్ లో మరుగుదొడ్లను మూసేస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అధికారుల నిర్ణయంతో అసలు మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన ఉద్దేశమే దెబ్బతింటోందని ప్రజలు వాపోతున్నారు.