Revanth Reddy: సెబాస్టియన్ కు నోటీసులు... రేవంత్ ఇంటిని ఇంకా వీడని ఈడీ, ఐటీ బృందం!
- నిన్నటి నుంచి కొనసాగుతున్న సోదాలు
- సెబాస్టియన్ ఇంట సోదాలు ముగిశాయి
- అక్టోబర్ 1న విచారణకు రావాలని ఐటీ శాఖ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో నిన్నటి నుంచి జరుగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. కాగా, ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ సాక్షిగా చూపిన సెబాస్టియన్ ఇంట్లో సోదాలు ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. ఆయనకు నోటీసులు జారీ చేశామని, అక్టోబర్ 1న విచారణకు హాజరు కావాలని తాఖీదులు ఇచ్చామని వెల్లడించారు. ఆదాయపు పన్ను కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని కోరామని, ఆయన అంగీకించారని ఓ అధికారి తెలియజేశారు.