Hyderabad: జీన్స్, షర్ట్, ఒళ్ళంతా బురద... హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై స్పృహలేని స్థితిలో యువతి!
- ఔటర్ రింగ్ రోడ్డుపై 23 ఏళ్ల యువతి
- చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
- ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాల్లో పోలీసులు
ఓ యువతి... బహుశా వయసు 23 సంవత్సరాలు ఉండవచ్చు. హైదరాబాద్ నగర శివార్లలోని కీసర - రాంపల్లిదాయర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్లాట్ ఫాంపై స్పృహ కోల్పోయి పడివుంది. ఈమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు, యువతి ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.
బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ ధరించిన ఈ యువతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఎందుకు వచ్చింది? ఎవరితో వచ్చింది? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా? అని పరిశీలిస్తున్నారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించామని తెలిపారు.