Telangana: ముందస్తు ఎన్నికలపై పిటిషన్... సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం షోకాజ్‌ నోటీసులు

  • ముందస్తు ఎన్నికల వల్ల 20 లక్షల మంది యువత ఓటు హక్కును కోల్పోతారంటూ పిటిషన్
  • ఎన్నికల్లో పారదర్శకత లోపించే ప్రమాదం ఉందంటూ ఆందోళన
  • వారంలోగా సమాధానాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన సుప్రీం

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగదని, ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దకుండా ఎన్నికలకు వెళ్తే, ఓటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుందంటూ సిద్ధిపేటకు చెందిన శశాంక్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

 2018 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది యువత ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. హడావుడిగా ఎన్నికలు జరిగితే పారదర్శకత లోపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో, పిటిషన్ లోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాతే ఈ పిటిషన్ పై తదుపరి విచారణ చేపడతామని చెప్పింది.

  • Loading...

More Telugu News