Pawan Kalyan: పవన్ కు షాక్.. జనసేనాని పర్యటనను బహిష్కరించిన గ్రామ పెద్దలు!

  • పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో టీడీపీపై విరుచుకుపడుతున్న పవన్
  • చింతమనేని ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు
  • పవన్ పర్యటనను బహిష్కరించిన గుడివాకలంక గ్రామ పెద్దలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామ పెద్దలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చారు. తమ గ్రామంలో ఆయన పర్యటనను బహిష్కరించారు. అంతేకాదు పవన్ పర్యటనలో గ్రామస్తులెవరైనా పాల్గొంటే రూ. 50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకు రౌడీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, పవన్ పై చింతమనేని కూడా అదే స్థాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో, గుడివాకలంక గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan
janasena
gudivakalanka
boycott

More Telugu News