TRS: హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం.. కారుపైకి దూసుకొచ్చిన తారాజువ్వలు!

  • సంగారెడ్డి పర్యటన సందర్భంగా ఘటన
  • స్వాగతిస్తూ బాణసంచా కాల్చిన కార్యకర్తలు
  • మంత్రి కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన తారాజువ్వలు

తెలంగాణ మంత్రి హరీశ్ రావు కు ప్రమాదం తప్పింది. మంత్రి రాక సందర్భంగా కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచాను కాల్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కాల్చిన కొన్ని తారాజువ్వలు మంత్రి కాన్వాయ్ పైకి దూసుకొచ్చాయి. భారీగా టపాసులు పేల్చడంతో ఈ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకోగా, రాకెట్లు తగిలి కొన్ని వాహనాలకు మంటలు అంటుకున్నాయి.

సంగారెడ్డిలో జరిగిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు వచ్చారు. దీంతో మంత్రి హరీశ్ ను స్వాగతిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచాను పేల్చాయి. ఈ సందర్భంగా 2-3 తారా జువ్వలు పైకి పోకుండా కాన్వాయ్ వైపు దూసుకొచ్చాయి. ఓ రాకెట్ మంత్రి కారును తాకింది.

ఈ సందర్బంగా మంటలు చెలరేగడంతో కార్యకర్తలు బైక్ లను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కార్యకర్తలు కాల్చిన టపాసులు 3 నిమిషాల పాటు పేలాయి. అంతసేపు కారులోనే ఉండిపోయిన హరీశ్..  ఆ తర్వాత కారు దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లారు.

  • Loading...

More Telugu News