sabarimala: శబరిమల తీర్పుకు నిరసనగా కేరళ బంద్ కు శివసేన పిలుపు!
- సుప్రీం తీర్పు పట్ల శివసేన అసంతృప్తి
- అక్టోబర్ 1న కేరళ బంద్ కు పిలుపు
- 12 గంటలపాటు బంద్ నిర్వహిస్తామని ప్రకటన
శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పు పట్ల శివసేన పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుకు నిరసనగా అక్టోబర్ 1వ తేదీన కేరళలో బంద్ చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం నాడు 12 గంటల పాటు బంద్ ను నిర్వహిస్తామని ప్రకటించింది.
10 నుంచి 50 ఏళ్ల లోపు ఉండే మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని నిన్న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయ్యప్ప భక్తుల్లో పురుషులు, మహిళలు అనే తేడా ఉండకూడదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు.