Google: యాపిల్ కు రూ. 65 వేల కోట్లు కట్టనున్న గూగుల్!
- సఫారీ వెబ్ బ్రౌజర్ లో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్
- 2013లో బిలియన్ డాలర్లు చెల్లించిన గూగుల్
- వచ్చే ఏడాది 12 బిలియన్ డాలర్లకు పెరగనున్న మొత్తం
ఐఫోన్ అందిస్తున్న సఫారీ వెబ్ బ్రౌజర్ లో గూగుల్ ను డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా ఉంచేందుకు ఈ సంవత్సరం 9 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 65,000 కోట్లు) గూగుల్ చెల్లించనుంది. తమ ఆపరేటింగ్ సిస్టమ్ పై వాడే వెబ్ బ్రౌజర్ లో గూగుల్ ను సెర్చ్ ఇంజన్ గా వినియోగించేందుకు 2013లో బిలియన్ డాలర్లు చెల్లించిన గూగుల్, ఆపై వినియోగదారులు పెరుగుతూ వచ్చిన కొద్దీ, ఆ మొత్తాన్ని పెంచింది. గతేడాది 3 బిలియన్ డాలర్లు చెల్లించింది. 4జీ వచ్చిన తరువాత, వెబ్ బ్రౌజింగ్ పెరగడం, కస్టమర్లు సంఖ్య ఇబ్బడిముబ్బడి కావడంతో ఈ ఏడాది 9 బిలియన్ డాలర్లు చెల్లించింది. వచ్చే సంవత్సరం ఇది 12 బిలియన్ డాలర్ల వరకూ పెరుగుతుందని, గోల్డ్‌మాన్ శాక్స్ అనలిస్ట్ రాడ్ హాల్ అంచనా వేస్తున్నారు.