AOB: ఏవోబీలో మావోయిస్టుల బహిరంగ సభ.. హాజరైన గిరిజనులు?
- ఈ సభలో పాల్గొన్న ఏడు పంచాయతీల గిరిజనులు
- గురుప్రియ వంతెనతో గిరిజనులకు ఉపయోగం లేదు
- ‘బలిమెల’ లో నీటిమట్టం పెరిగితే పంటలకు నష్టమన్న మావోయిస్టులు?
ఓపక్క అరకు ఏజన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసుల కూంబింగ్ జరుగుతున్నప్పటికీ, ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్ ఏరియాలో మావోయిస్టులు బహిరంగ సభ నిర్వహించినట్టు తెలుస్తోంది. విశాఖపట్ణణం జిల్లాలోని ఏడు పంచాయతీలకు చెందిన గిరిజనులు ఇందులో పాల్గొన్నట్టు సమాచారం.
ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్ గిరి జిల్లాలో ఉన్న బలిమెల రిజర్వాయర్ పై గురుప్రియ వంతెన వల్ల గిరిజనులకు ఎటువంటి ఉపయోగం లేదని పలువురు మావోయిస్టులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ రిజర్వాయర్ లో నీటిమట్టం పెరిగినప్పుడు వందల ఎకరాలు జలమయం అవుతున్నాయని, రైతులు నష్టపోతున్న విషయాన్ని వారు చర్చించినట్టు తెలుస్తోంది.