Telangana: రైలుపై తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు.. జనగామలో తప్పిన పెను ప్రమాదం!

  • హైటెన్షన్ వైర్లు తెగిపడి రైలుపై మంటలు
  • విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు
  • ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు

జనగామ రైల్వే స్టేషన్‌ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. హైటెన్షన్ వైర్లు తెగిపడి గూడ్సు రైలుపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. లోకో పైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

గూడ్సు రైలు సికింద్రాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్తుండగా బాణాపురం రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో కాజీపేట మార్గంలో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సికింద్రాబాద్ నుంచి బళార్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును పెంబర్తి వద్ద గంటపాటు నిలిపివేశారు. సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన అనంతరం రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News