renalt: కారు చూస్తే ఫిదా అయిపోతారు.. ప్యారిస్‌ ఆటో షోలో రెనాల్ట్‌ మోడల్‌ ప్రత్యేక ఆకర్షణ

  • డ్రైవర్‌ అవసరం లేదు
  • యాప్‌లో రూట్‌ మ్యాప్‌ ఫీడ్‌ చేస్తే ఎంచక్కా గమ్యం చేరిపోతుంది
  • విద్యుత్‌ ఇంధనం వల్ల పర్యావరణానికి మేలు

ఆ కారును చూస్తే ఫిదా అయిపోతారు. కారు ప్రత్యేకతలు తెలుసుకుంటే సూపర్ అని అనకుండా ఉండలేరు. అన్ని ప్రత్యేకతలతో కనిపించే రెనాల్ట్‌ కంపెనీకి చెందిన ఈ జెడ్‌ అల్టిమో కాన్సెప్ట్‌ కారు సందర్శకులకు భలే నచ్చేసింది. ప్యారిస్‌ ఆటో షోలో ప్రదర్శించిన ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారును చూసినోళ్లంతా మనసు పారేసుకున్నారట. ఈ కారుకు డ్రైవర్‌తో పనిలేదు. యజమాని తన మొబైల్‌లో లోడ్‌ చేసిన ప్రత్యేక యాప్‌లో ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలో రూట్‌ మ్యాప్‌ ఫీడ్‌ చేస్తే చాలు. ఎంచక్కా గమ్యానికి చేరిపోతుంది.

ఇందుకోసం అవసరమైన కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు కారులో అమర్చారు. పైగా విద్యుత్‌ ఇంధనంతో నడిచే కారు కావడంతో పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. పందొమ్మిది అడుగుల పొడవుండే ఈ కారులో ఇంటీరియర్‌ కూడా అద్భుతంగా రూపొందించారు. సీట్లు అటూ ఇటూ కదులుతూ సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటుచేశారు. అన్నీ లెదర్‌ సీట్లే. అవసరమైన చోట్ల మార్బుల్‌, చెక్క కూడా వినియోగించారు. సౌకర్యవంతమైన, విలాసవంతమైన వ్యక్తిగత కారు కావాలని కోరుకునే వారితో పాటు కార్పొరేట్‌ అవసరాలకు ఉపయుక్తమయ్యేలా దీన్ని రూపొందించినట్లు రెనాల్ట్‌ కంపెనీ చెబుతోంది. అయితే దీని ధర, ఎప్పుడు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News