swedan: గడువిస్తే రూ.550 కోట్లు చెల్లిస్తాం: ఆర్‌కామ్ సంస్థ
- 2014లో ఎరిక్సన్తో ఒప్పందం
- 2016 నుంచి బిల్లుల నిలిపివేత
- వడ్డీతో కలిపి రూ.1600 కోట్లు
దేశంలో ఏడేళ్ల కాలానికి గానూ తన నెట్వర్స్ నిర్వహణ కోసం ఆర్‌కామ్ సంస్థ 2014లో స్వీడన్‌కు చెందిన టెలికాం సంస్థ ఎరిక్సన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సంస్థ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2016 నుంచి బిల్లులు చెల్లించలేదు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆర్‌కామ్ సంస్థ లా అథారిటీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆర్‌కామ్ నుంచి రావాల్సిన బకాయిలు వడ్డీతో కలిపి రూ.1600 కోట్లు అయ్యాయని ఎరిక్సన్ తరుపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు.
ఈ క్రమంలో అసలు రూ.550 కోట్లు చెల్లించి వివాదాన్ని పరిష్కరించుకుంటామని ఆర్‌కామ్ కోర్టుకు తెలిపింది. అయితే, గడువు లోపల ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో, ఎరిక్సన్ సంస్థ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు మరో 60 రోజుల గడువిస్తే ఎరిక్సన్తో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రూ.550 కోట్లు చెల్లిస్తామని ఆర్‌కామ్ సంస్థ సుప్రీంకోర్టును కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. స్పెక్ట్రమ్ అమ్మకానికి అనుమతించాలని కోరుతూ టెలీకమ్యూనిషన్స్ విభాగానికి ఆగస్టు 7న దరఖాస్తు చేసుకున్నట్లు అందులో పేర్కొంది.