TRS: బతుకమ్మ చీరల పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశాలు
- కోటి చీరాల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు
- తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నఈసీ
- ఈసీ ఆదేశాలతో నిలిచిపోనున్న చీరల పంపిణీ
తెలంగాణలో ఈ నెల 9 నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బతుకమ్మ చీరల పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు జారీ చేసింది.
ఈసీ ఆదేశాలతో బతుకమ్మ చీరల పంపిణీ నిలిచిపోనుంది. పండగలోగా కోటి చీరల పంపిణీకి తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసుకుంది. రూ.250 కోట్ల ఖర్చుతో వీటి పంపిణీకి సిద్ధపడింది. ఇప్పటికే యాభై లక్షల చీరలు పలు జిల్లాలకు చేరుకున్నాయి.