petrol: వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్రం
- పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
- లీటర్ కు రూ.2.50 చొప్పున తగ్గిస్తున్నాం
- కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లీటరు పెట్రోల్, డీజిల్ పై రూ. 2.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని, ద్రవ్యలోటు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. చమురు ధరలపై రాష్ట్రాలు కూడా కొంత పన్నులు తగ్గించుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ.10,500 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుందని చెప్పారు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, రూపాయ బలహీన పడటం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.